AP Rain Alert : ఏపీపై తుఫాన్ పంజా.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

Must read

AP Rain Alert : ఏపీలో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Goddeti Madhavi: స్థానిక పోరులో సంచలనం.. జెడ్పీటీసీ బరిలో మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి నామినేషన్!

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలోని అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే ఏలూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు, రైతులు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు వర్షాలు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!