Tirupati Woman Nomination with 6000 Coins : ఇంటింటికీ ‘రూపాయి’ చందా.. 6000 కాయిన్స్‌తో నామినేషన్ వేసిన మహిళ.. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే?

Must read

Tirupati Woman Nomination with 6000 Coins : ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. పలుచోట్ల ఘర్షణలు తలెత్తుతుండగా మరికొన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులంతా ఏదో పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన వారే. కానీ, తమ గ్రామంలోని సమస్యలను ఏ పార్టీ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదంటూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతోంది ఓ మహిళ.

Also Read : YS Jagan : సుప్రీంకోర్టు తీర్పు అంటే గౌరవం లేదా..? చంద్రబాబు, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఫైర్

తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన సుభద్ర అనే మహిళ తన గ్రామానికి అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎంపిటీసిగా నామినేషన్ దాఖలు చేసింది. అందుకోసం అవసరమైన నగదును చిగురువాడ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఒక్క రూపాయి చొప్పున చందా రూపంలో వసూలు చేసింది. అలా వసూలు చేసిన 6000 రూపాయల నాణేలను నామినేషన్ కేంద్రానికి తీసుకొచ్చి నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ కేంద్రానికి తన తమ్ముడిని వెంటపెట్టుకొని వచ్చిన మహిళ.. తనను నామినేషన్ వేయడానికి ప్రోత్సహించిన గ్రామస్థులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తమ ఊరి సమస్యలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని సుభద్ర వెల్లడించారు. తమ గ్రామంలో మౌలిక సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఏనాడూ పట్టించుకోలేదని, ఓట్లు వేయించుకుని.. తర్వాత ముఖం చాటేయడం రాజకీయ నాయకుల వంతైందని ఆమె అన్నారు. సంవత్సరాల తరబడి తమ గ్రామానికి న్యాయం జరగడం లేదని వాపోయారు. అందుకే గ్రామస్థుల ఆదరణతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సుభద్ర చెప్పారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!