Shamonda Virus : ప్రపంచానికి భయపెడుతున్న మరో కొత్త వైరస్.. తొలిసారి మనుషులకు సోకడంతో వైద్య రంగం షాక్! కొత్త ముప్పు పొంచి ఉందా?

Must read

Shamonda Virus : ప్రపంచాన్ని కోరనా మహమ్మారి ఎంతగా వణికించిందో అందరికీ తెలిసిందే. ఆ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే, ప్రస్తుతం మరోవైరస్ ప్రంపచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మనుషులలో ఎప్పుడూ చూడని ఒక కొత్త వైరస్ ఫ్రాన్స్‌లో తొలిసారిగా వెలుగుచూడటం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా మూగజీవాలకు మాత్రమే సోకే ‘షమోండా వైరస్’ ఒక వ్యక్తిలో బయటపడటమే కాకుండా, ఆ వ్యక్తి మరణించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కీటకాల ద్వారా మనుషులకు వ్యాపిస్తున్న ఈ వైరస్ భవిష్యత్తులో కొత్త మహమ్మారిగా మారుతుందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వింత వైరస్ వ్యాప్తి వైద్య రంగాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది.

Also Reada : Gold-Silver Prices Today : మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న గోల్డ్ రేటు.. నేడు ఎంత తగ్గిందంటే?

ఫ్రాన్స్‌లో మొట్టమొదటిసారిగా మానవుడిలో ‘షమోండా వైరస్’ (Shamonda virus) వెలుగుచూడడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వైరస్ బారిన పడిన ఒక వ్యక్తి ఈ నెలలో మృతి చెందగా, ఆయన మరణానికి ఈ వైరస్ ఏమైనా కారణమా అనే కోణంలో ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

సాధారణంగా బన్యావైరస్ (Bunyavirus) కుటుంబానికి చెందిన ఈ షమోండా వైరస్.. పశువులు, గొర్రెలు, మేకలు, గుర్రాల వంటి జంతువులలో ‘మిడ్జెస్’ (Midges) అనే కీటకాల కాటు ద్వారా వ్యాపిస్తుంది. గత వేసవిలో యూరోపియన్ దేశాల్లోని పశువులలో తొలిసారిగా బయటపడిన ఈ వైరస్, జంతువులలో డయేరియా, ఆకలి మందగించడం, పాలు ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది.

ఫ్రాన్స్‌లో ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఇదివరకే తీవ్ర అనారోగ్యం ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి బలహీనపడి ఉందని ఈసీడీసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మృతికి ఈ వైరస్ ఏ మేరకు కారణమైందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దీనికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఎలా సోకిందనే అంశంపై వైద్య నిపుణులు లోతైన పరిశోధనలు చేపట్టారు.

ఈ ఘటనపై స్పందించిన లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన పాండమిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ టాం సోలమన్.. సాధారణ ప్రజలకు దీనివల్ల ముప్పు చాలా తక్కువని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జంతువులలో మాత్రమే సంచరిస్తున్న ఈ వైరస్ మనుషులకు సోకడం అత్యంత అరుదని, అలాగే మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.

మిడ్జ్ అనే కీలకం ద్వారా సంక్రమించే ఈ వైరస్ ను తొలిసారి 1960ల్లో నైజీరియాలో కనుగొన్నారు. ఇది ఈ ఏడాది ఐరాపో దేశాలకూ విస్తరించింది. ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల వచ్చే పెద్దముప్పు ఏమీ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!