Preeti Reddy : వెంకటేష్ సినిమా రిలీజ్.. కాలేజీకి సెలవు ప్రకటించిన మల్లారెడ్డి కోడలు..

Must read

Preeti Reddy : వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకకు త్రివిక్రమ్, వెంకటేష్, శ్రీనిధి శెట్టితో పాటు మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా. ప్రీతి రెడ్డి కూడా హాజరు అయ్యారు.

ఈ ఈవెంట్ ప్రీతి రెడ్డి సినిమా గురించి మాట్లాడిన అనంతరం స్టూడెంట్స్ ని ఉద్దేశించి.. మీరంతా ఈ సినిమాని అక్టోబర్ 30న చూడాలి అనుకుంటున్నాను. మీరు రెడీనా అని అడిగారు. ఆ రోజు మీకు సెలవు కావాలా అని అడగడంతో స్టూడెంట్స్ అంతా ఎస్ అంటూ అరిచారు. దీంతో.. మీరు ఈ సినిమా చూస్తానని ప్రామిస్ చేస్తేనే నేను హాలిడే ఇస్తాను. ఆ రోజు హాలిడే డిక్లేర్ చేస్తున్నాను అని తెలిపారు.

Also Read : Mr Deyyam : ‘మిస్టర్ దెయ్యం’ సినిమా ఓపెనింగ్.. మంచు మనోజ్ గెస్ట్ గా హారర్ కామెడీ..

హాలిడే ప్రకటించడంతో స్టూడెంట్స్ అంతా అరుపులతో సందడి చేసారు. మొత్తానికి వెంకటేష్ సినిమా ఈవెంట్ ఆ కాలేజీలో పెట్టడంతో ఈ సినిమా కోసం ప్రీతి రెడ్డి ఆదర్శ కుటుంబం రిలీజ్ రోజు హాలిడే ప్రకటించడం వైరల్ గా మారింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!