PF Withdrawal Rules : జాబ్ పోయినా నో టెన్షన్.. మీ PF ఖాతాలో రూ.1 లక్ష ఉందా? ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చంటే?

Must read

  • మీ PF ఖాతాలో డబ్బులున్నాయా? అవసరానికి ఎంత విత్‌డ్రా చేయొచ్చు?
  • పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి
  • పెళ్లి, చదువు, వైద్యం.. పీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు కొత్త రూల్స్ ఇవే

PF Withdrawal Rules : అత్యవసరంగా డబ్బు అవసరమైతే అప్పు చేయాల్సిన పనిలేదు.. మీ ఉద్యోగ భవిష్య నిధి (PF) ఖాతాలో ఉన్న డబ్బు కూడా ఆర్థికంగా ఆదుకోవచ్చు. అయితే, పీఎఫ్‌లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా మొత్తం డబ్బును ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోలేరు. మీరు డబ్బు ఎందుకు విత్‌డ్రా చేస్తున్నారు? మీ సభ్యత్వ కాలం ఎంత? అనే అంశాలపై అర్హత ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలివే..

రూ.1 లక్ష ఉంటే ఎంత వస్తుంది? :
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. అర్హత ఉన్న సభ్యులు కనీసం 12 నెలల పీఎఫ్ సభ్యత్వం పూర్తవ్వాలి. నిబంధనలకు లోబడి తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే మీ ఖాతాలో రూ.1,00,000 ఉంటే, అర్హత ప్రకారం గరిష్ఠంగా రూ.75వేల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన 25 శాతం కనీస బ్యాలెన్స్‌గా ఖాతాలో ఉండాలి.

ఉద్యోగం పోతే ఎంత తీసుకోవచ్చు? :

ఉద్యోగం కోల్పోయినప్పుడు తక్షణ అవసరాల కోసం పీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం తీసుకోవాలంటే వరుసగా 12 నెలలు నిరుద్యోగిగా ఉండాలి.

Read Also : WhatsApp SIM Binding : బిగ్ అలర్ట్.. మీ ఫోన్‌లో సిమ్ కార్డు తీస్తే వాట్సాప్ బంద్? కేంద్రం కొత్త రూల్స్‌ ఇవే..

చదువు, పెళ్లి ఖర్చులకూ పీఎఫ్ డబ్బులు :
పిల్లల చదువు లేదా కుటుంబ సభ్యుల విద్యా ఖర్చుల కోసం అర్హత మేరకు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని మొత్తం సభ్యత్వ కాలంలో గరిష్ఠంగా 10 సార్లు తీసుకోవచ్చు. పెళ్లి ఖర్చుల కోసం గరిష్ఠంగా 5 సార్లు అడ్వాన్స్ పొందే అవకాశం ఉంది.

వైద్యం, ఇల్లు కొనుగోలుకూ అవకాశం :
అనారోగ్యం, వైద్య చికిత్స ఖర్చుల కోసం పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇల్లు లేదా ఫ్లాట్ కొనడం, స్థలం కొనడం, ఇల్లు నిర్మించడం, హోం లోన్ చెల్లించడం, ఇంటి రిపేరింగ్ వంటి అవసరాలకూ నిబంధనల ప్రకారం పీఎఫ్ డబ్బులను తీసుకోవచ్చు.

అయితే, గృహ అవసరాలకు సంబంధించి ఈ సదుపాయం గరిష్ఠంగా ఐదు సార్లు వర్తిస్తుంది. 75 శాతం అనేది అందరికీ, అన్ని సందర్భాల్లోనూ వర్తించే హామీ కాదు. విత్‌డ్రా చేసే ముందు ఈపీఎఫ్ఓ అధికారిక నిబంధనలు, మీ అర్హత, ఖాతా వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి..

  • అర్హత ఉంటే 75 శాతం లెక్కన రూ.75వేల వరకు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది.
  • కనీస సభ్యత్వం : పాక్షిక ఉపసంహరణలకు సాధారణంగా 12 నెలల పీఎఫ్ సభ్యత్వం తప్పనిసరి
  • ఉద్యోగం కోల్పోతే : 75 శాతం వరకు వెంటనే తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతం కోసం 12 నెలల ఖాళీగా ఉండాలి..
  • విద్య, పెళ్లి : విద్య కోసం గరిష్ఠంగా 10 సార్లు, పెళ్లి కోసం 5 సార్లు అడ్వాన్స్ పొందే అవకాశం ఉంది
  • ఇల్లు, వైద్యం : అర్హత, సంబంధిత నిబంధనల మేరకు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.
- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!