Cm Revanth Reddy: రాబోయే రోజుల్లో తీవ్ర కరువు.. జూలై నాటికి తాగునీటి సమస్యలు.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ బిగ్ అలర్ట్

Must read

Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, ప్రజలతో పాటు రైతాంగం తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)అత్యవసర మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ప్రారంభంలో చిన్నగా అనిపించినప్పటికీ, జూలై నాటికి కరువు ప్రభావం గరిష్ట స్థాయికి చేరి తాగునీటికీ తీవ్ర అభద్రత ఏర్పడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఇప్పటికే కొన్ని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ షాపుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విపత్కర సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కోరారు.

YSRCP: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల వివాదం.. ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్

బీఆర్ఎస్ మాటలు నమ్మి మోసపోవద్దు.. ప్రతిపక్షాలపై విమర్శలు:

ఈ విపత్కర సమయంలో బిఆర్ఎస్ నేతల అవాస్తవ ప్రచారాలను నమ్మి రైతులు ఎవరూ మోసపోవద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ‘క్రోసిన్ వేసుకుంటే సరిపోతుంది’ అంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించి ప్రజలను ప్రాణసంకటంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు హరీష్ రావు ఉచిత సలహాలు, మాటలు నమ్మి నీటి లభ్యత లేని చోట పంటలు వేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ఆనాడు ఉపాధి హామీ పథకమే పేదలకు అండగా నిలిచిందని, కేంద్రంలోని ప్రధాని మోడీలా చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి వంటి ప్రచారార్భటాలకు పోకుండా తాము క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రజలను ఆదుకుంటున్నామని తేల్చిచెప్పారు.

రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. కొనుగోలు చేసి సఫలై ఇస్తున్నాం:

రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం ఊహించని రీతిలో పెరిగిందని, ఏకంగా 20,000 మెగావాట్లకు పైగా పీక్ డిమాండ్ నమోదైందని సీఎం రేవంత్ వెల్లడించారు. ఎంత ఖర్చైనా, ఎంత కష్టమైనా సరే రైతాంగం పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం బయట నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి మరి నిరంతర సరఫరా అందిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం మూడు నెలల క్రితమే కరువు రాకపై స్పష్టమైన ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేసిందని, విపత్తు నిర్వహణకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నాహకాలు పూర్తి చేసిందని వివరించారు.

కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలి.. మోడీ కుట్రలను తిప్పికొడదాం:

సార్వత్రిక ఓటు హక్కుల పవిత్రతను మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని, ‘SIR’ పేరుతో లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో మోడీ వినాశకర కుట్రలను గట్టిగా తిప్పికొడతామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు అధికారంలోకి రావడం కొత్త కాదని, ఓడిపోయినా రెట్టింపు ప్రజాదరణతో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కొందరు చిమ్ముతున్న విష ప్రచారాలను తిప్పికొడుతూ పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!