AI Agents Banking Risks : ఏఐ ఏజెంట్లతో జాగ్రత్త! మీ పర్మిషన్ లేకున్నా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయం చేస్తాయా?

Must read

  • ఏఐ ఏజెంట్లతో బ్యాంకింగ్ రిస్క్.. మీ డబ్బుకు భద్రత ఉందా?
  • మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఏఐ ఏజెంట్లు ఎంట్రీ ఇస్తే ఏమవుతుంది?
  • ఏఐ ఏజెంట్లకు బ్యాంకులు ఎందుకు చెక్ పెడుతున్నాయి?

AI Agents Banking Risks : ఏఐ ఏజెంట్లతో జర జాగ్రత్త.. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఈ తప్పులు అసలు చేయొద్దు.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన పనులు చాలా ఈజీ అయిపోతున్నాయి.. ముఖ్యంగా ఏఐ రాకతో ఎన్నో పనులను క్షణాల్లో పూర్తి చేయొచ్చు. అయితే, ఇదే టెక్నాలజీ బ్యాంక్ ఖాతాల విషయంలో సమస్యగా మారితే? అవును..మీరు చదివింది నిజమే.. ప్రస్తుతం ఇదే అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

మీరు చెబితే చకచకా పనులుచేసి పెట్టే ఏఐ ఏజెంట్లు మీరు చెప్పకుండానే డబ్బులకు సంబంధించిన పనులు చేసేందుకు ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు ఇలాంటి ప్రమాదాలపై చాలా అలర్ట్ అవుతున్నాయి.. ఖాతాదారులను ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ వ్యక్తిగత వివరాలను ఏఐ ఏజెంట్లతో షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నాయి..

ఏఐ ఏజెంట్లతో అసలు సమస్య ఏంటి? :
సాధారణ ఏఐ టూల్స్ మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. కానీ, ఏఐ ఏజెంట్లు అంతకంటే ఎక్కువ పనులు చేయగలవు. మన తరఫున వెబ్‌సైట్లను అవే వాడుతాయి. కావాల్సిన వివరాలను సేకరించి పెడతాయి.. ఏదైనా ఆన్ లైన్ షాపింగ్, కొనుగోళ్లు చేయడం వంటి పనులను కూడా చేసిపెడతాయి. అయితే, మనం ఇచ్చే సూచనలను ఏఐ ఏజెంట్లు తప్పుగా అర్థం చేసుకున్నా లేదా మనం కోరుకోని పనిని చేసేందుకు అవే ప్రయత్నించినా అనేక ఇబ్బందులకు దారితీయొచ్చు.

Read Also : Post Office NSC Scheme : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. కేవలం వడ్డీనే రూ.5 లక్షలకుపైగా సంపాదించవచ్చు.. పైగా జీరో రిస్క్..!

కొంతమంది తమ బ్యాంక్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను ఏఐ టూల్స్‌తో షేర్ చేస్తున్నారు. దీనివల్ల ఆ టూల్స్‌కు అకౌంట్ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. వాటికి ఉన్న అనుమతులు, బ్యాంక్ భద్రతా వ్యవస్థలను బట్టి ఆర్థిక లావాదేవీల రిస్క్ కూడా పెరగొచ్చు.

ఏఐ ఏజెంట్లపై బ్యాంకుల ఆంక్షలు :

ఈ రిస్క్ దృష్టిలో పెట్టుకునే అమెరికాలోని జేపీ మోర్గాన్ చేజ్, మోర్గాన్ స్టాన్లీ, చార్లెస్ ష్వాబ్ వంటి ఆర్థిక సంస్థలు బయటి ఏఐ ఏజెంట్లకు తమ సర్వీసులను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఖాతాదారుల వివరాలు, లావాదేవీలపై కంట్రోలింగ్ తమ చేతుల్లోనే ఉండాలని బ్యాంకులు భావిస్తున్నాయి.

ఖాతాదారులు ఏం చేయాలి? :
ఏఐ ఏజెంట్ మీకు తెలియకుండా లావాదేవీ చేసేందుకు ప్రయత్నిస్తే బాధ్యత ఎవరిపై ఉంటుంది? మీరు స్వయంగా లాగిన్ వివరాలు ఇచ్చినప్పుడు, ఆ లావాదేవీకి నిజంగా మీ అనుమతి ఉందా లేదా అనేది కన్ఫార్మ్ చేయడం చాలా క్లిష్టంగా మారవచ్చు.

అందుకే, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు వంటి కీలక వివరాలను ఏఐ టూల్స్‌తో షేర్ చేయొద్దు. బ్యాంకు అధికారికంగా అనుమతించిన సేవలనే వాడాలి. మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. ఏఐ మీ పనులను ఈజీ చేయొచ్చు.. కానీ మీ బ్యాంక్ ఖాతా భద్రత విషయంలో జాగ్రత్తగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!