Saudi Strict Rules: ఏడాదిలో 100 మందికి పైగా మరణశిక్ష.. సౌదీలో కఠిన చట్టాలు.. తెలుసుకోకపోతే ప్రమాదమే!

Must read

Saudi Strict Rules: ఉద్యోగం, వ్యాపారం లేదా పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులు ఆ దేశంలో అమల్లో ఉన్న అత్యంత కఠినమైన చట్టాలు, ఆచారాలు, సాంప్రదాయాలపై విధిగా అవగాహన పెంచుకోవాలని వివిధ దేశాల రాయబార కార్యాలయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇస్లామిక్ షరియా సూత్రాలను అత్యంత కఠినంగా అమలు చేసే సౌదీ అరేబియాలో, ఇతర దేశాల్లో సాధారణంగా భావించే చిన్న చిన్న పొరపాట్లు కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి.

స్థానిక చట్టాలు తెలియక ఉల్లంఘించినప్పటికీ తక్షణ అరెస్టు, సుదీర్ఘ జైలు శిక్ష, భారీ జరిమానా లేదా దేశం నుంచి తక్షణ బహిష్కరణ (డీపోర్టేషన్) ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్, బ్రిటన్, భారత్ ఎంబసీలు తమ పౌరులను హెచ్చరించాయి. అమ్నేస్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా మరణశిక్షల అమలులో అగ్రస్థానంలో ఉందని, ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 100 మందికి మరణదండన విధించారని, విదేశీయులు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

Supreme Court: తెలంగాణ పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు బడుల్లో ఉచిత విద్య.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సైబర్ నేరాలు, ఫొటోగ్రఫీ & బహిరంగ ప్రవర్తనా ఆంక్షలు:

ఫొటోగ్రఫీ & సోషల్ మీడియా: సౌదీ (Saudi Strict Rules)సైబర్ నేరాల నిరోధక చట్టం ప్రకారం ఎదుటి వ్యక్తుల అనుమతి లేకుండా ఫొటోలు తీయడం లేదా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్రమైన నేరం. దీనికి 5 లక్షల సౌదీ రియాల్స్ (రూ. 1.1 కోట్లకు పైగా) జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

నిషేధిత ప్రవర్తనలు: బహిరంగ ప్రదేశాల్లో ప్రేమను చూపించడం, దూషించడం, అసభ్యకర సైగలు చేయడం, పెద్ద శబ్దంతో సంగీతం వినడం, నిరసనలు/ఆందోళనలు చేయడం నిషేధం. మీడియాను అధికారులు నియంత్రిస్తారు; ప్రభుత్వం, రాజకుటుంబం లేదా ఇస్లాంపై రాజకీయ విమర్శలు చేసినా, ప్రజలను రెచ్చగొట్టినా విచారణ లేకుండా నిర్బంధించడం, శారీరక శిక్షలు (కొరడా దెబ్బలు) లేదా మరణశిక్ష కూడా విధించవచ్చు.

అమెరికా ఎంబసీ హెచ్చరిక: చట్టం ఉల్లంఘిస్తే లాయర్ లేకుండా విచారణ, బలవంతపు సంతకాలు, శారీరక శిక్షలు, దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడం వంటి తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యూఎస్ పేర్కొంది.

వలస కార్మికుల నిబంధనలు (కఫాలా) & డ్రెస్ కోడ్:

కఫాలా విధానం & గుర్తింపు కార్డులు: డిసెంబర్ 2025 నాటికి 27.47 లక్షల మంది భారతీయ కార్మికులు సౌదీలో ఉన్నారు. వీరికి ‘కఫాలా’ (స్పాన్సర్‌షిప్) విధానం వర్తిస్తుంది, కాబట్టి ఒప్పందం ఉన్నంత వరకు స్థానిక ‘కఫీల్’ (స్పాన్సర్) బాధ్యతలోనే ఉండాలి. విదేశీయులు ఎల్లప్పుడూ నివాస గుర్తింపు కార్డు (‘ఇఖామా’), పర్యాటకులు పాస్‌పోర్ట్/వీసా కాపీలను తమ వెంట ఉంచుకోవాలి.

దుస్తుల కోడ్: మహిళలకు నల్లటి అబయా, హెడ్‌స్కార్ఫ్ ధరించడం ఇప్పుడు నిర్బంధం కాకపోయినప్పటికీ, స్త్రీ పురుషులిద్దరూ భుజాలు, మోకాళ్లు కప్పేలా వదులైన దుస్తులే ధరించాలి. బిగుతైన దుస్తులు, రాజకీయ/మతపరమైన నినాదాలు, అశ్లీల చిత్రాలు లేదా సంకేతాలు ఉన్న దుస్తులు ధరిస్తే జరిమానా విధిస్తారు.

మతాచారాలు, మందుల నిషేధం & తీవ్ర నేరాలకు శిక్షలు:

మతపరమైన నిబంధనలు: బహిరంగంగా ఇస్లాం మినహా ఇతర మతప్రచారాలు లేదా ప్రార్థనలు చట్టవిరుద్ధం. ఇస్లాం, ఖురాన్, మత పెద్దలను విమర్శిస్తే 10-20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణశిక్ష పడవచ్చు. మత మార్పిడులు నిషేధం, సొంతానికి మినహా భారీగా ఇతర మత గ్రంథాల దిగుమతి నిషిద్ధం.

మందులు & నిషేధిత వస్తువులు: డ్రగ్స్ కేసుల్లో 30 వేల రియాల్స్ ఫైన్, 5 ఏళ్ల జైలు నుంచి మరణశిక్ష వరకు ఉంటుంది. మద్యం, పంది మాంసం, గసగసాలు, ఖాత్ ఆకులు, గుట్కా, పాన్ మసాలా, అశ్లీల/మంత్రతంత్రాల వస్తువులపై సంపూర్ణ నిషేధం ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో గరిష్టంగా 30 రోజులకు మించకుండా వైద్య పత్రాలతో మాత్రమే మందులు తెచ్చుకోవాలి.

లైంగిక నేరాలు, స్వలింగ సంపర్కం & దొంగతనాలు: స్వలింగ సంపర్కం సంపూర్ణంగా నిషేధం. లైంగిక వేధింపులకు 2-5 ఏళ్ల జైలు, 1-3 లక్షల రియాల్స్ ఫైన్ ఉంటుంది (బాధితురాలి పేరు బయటపెట్టినా శిక్ష పడుతుంది). లైంగిక దాడికి కొరడా దెబ్బల నుంచి మరణశిక్ష పడవచ్చు (వైవాహిక జీవితంలో లైంగిక వేధింపులను చట్టం నేరంగా పరిగణించదు). దొంగతనాలకు 1-7 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. హింస/ఆయుధాలు ఉపయోగిస్తే ఉగ్రవాద చర్యగా పరిగణించి మరణశిక్ష విధిస్తారు (సాక్ష్యాధారాల కఠిన నిబంధనల వల్ల చేతులు నరికే షరియా శిక్షను అరుదుగా అమలు చేస్తున్నారు).

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!