iQOO Z11 Lite Amazon : బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫోన్.. ఐక్యూ Z11 లైట్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్.. ఎంత చవకంటే?

Must read

  • తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?
  • ఐక్యూ జెడ్ 11 లైట్ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్
  • 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. అమెజాన్ డీల్

iQOO Z11 Lite Amazon Sale : పండుగ వేళ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్ సేల్‌లో ఈ ఫోన్‌పై స్పెషల్ కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ మొబైల్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. పూర్తి ఆఫర్, ధర వివరాలివే..

ఐక్యూ జెడ్11 లైట్ ధర ఎంతంటే? :
ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 19,499గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ. 19,497గా ఉంది. ఈ సేల్‌లో రూ. 2,500 కూపన్ డిస్కౌంట్‌ ధర రూ. 16,997కు తగ్గుతుంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే కస్టమర్లు రూ.584 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే, ఆఫర్లకు సంబంధించిన నిబంధనలు, అర్హతలను కొనుగోలుకు ముందు చెక్ చేయడం బెటర్..

Read Also : Best 5G SmartPhones : రూ. 15వేల లోపు కొత్త 5G ఫోన్ కావాలా? Mivi, HMD, శాంసంగ్ ఫోన్లలో ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్!

డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలివే :
ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ అందించారు. 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. గరిష్ఠంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు అందిస్తుంది. స్క్రీన్‌పై కంటెంట్‌ను చూడటం చాలా ఈజీగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.ఇందులో ఆరిజిన్ OS6 ఆధారిత ఆండ్రాయిడ్ 16 కూడా ఉంది.

బ్యాటరీ, కెమెరా ఫీచర్లు :
ఈ మొబైల్‌లో 6500mAhతో బ్యాటరీని అమర్చారు. 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అందించారు. ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP మెయిన్ కెమెరా, అదనంగా 0.08MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరాను అందించారు.

IP65 రేటింగ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.4, Wi-Fi, జీపీఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. బడ్జెట్‌లో భారీ బ్యాటరీ, అదిరే డిస్‌ప్లే ఫీచర్లు కోరుకునేవారు ఈ సేల్ ఆఫర్‌ను పొందవచ్చు. కొనుగోలు చేసే ముందు అమెజాన్‌లో లేటెస్ట్ ధర, కూపన్ ఎంతకు లభిస్తుందో చెక్ చేయండి..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!