Honor Win Turbo 2 : కొత్త హానర్ విన్ టర్బో2 చూశారా? 12070mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదుర్స్, ధర జస్ట్..!

Must read

  • 12,070mAh భారీ బ్యాటరీతో హానర్ విన్ టర్బో2 ఫోన్
  • 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,199 యువాన్లు
  • 6.89-అంగుళాల 2K OLED డిస్‌ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్

Honor Win Turbo 2 : హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. అదే హానర్ విన్ టర్బో2 ఫోన్.. IP68, IP69, IP69K రేటింగ్‌లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ మ్యాజిక్‌ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

ఈ హానర్ ఫోన్‌లో 12,070mAh భారీ బ్యాటరీ కూడా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా (Honor Win Turbo 2) ఉన్నాయి. హానర్ విన్ టర్బో2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..

హానర్ విన్ టర్బో2 ధర ఎంతంటే? :

హానర్ విన్ టర్బో2 ధర 8GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు 3,199 యువాన్లు (సుమారుగా రూ.45,309), 12GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు 3,499 యువాన్లు (సుమారుగా రూ.49,560), 16GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు 3,899 యువాన్లు (సుమారుగా రూ.55,225), 12GB+512GB స్టోరేజ్ వేరియంట్‌కు 4,199 యువాన్లు (సుమారుగా రూ.59,470), 16GB+512GB స్టోరేజ్ వేరియంట్‌కు 4,499 యువాన్లు (సుమారుగా రూ.63,620)గా ఉంది. ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో అమ్మకానికి రెడీగా ఉంది. రెడ్ అండ్ బ్లూ బఫ్, డెసిగ్నేటెడ్ విన్, క్విక్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఏ ప్లాట్‌ఫామ్ బెస్ట్ ఆఫర్ ఇస్తోంది? ఈ మూడు స్టోర్లలో ఎక్కడ చీప్..?

హానర్ విన్ టర్బో2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హానర్ విన్ టర్బో2లో 185Hz రిఫ్రెష్ రేట్, 10,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.89-అంగుళాల 2K ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే టీయూవీ రైన్‌ల్యాండ్ గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 6.0, ఫ్లికర్-ఫ్రీ ద్వారా అందిస్తుంది. ఈ డిస్‌ప్లే డైనమిక్ డీఫోకస్ స్మూతింగ్, 3డీ యాంటీ-డిజ్జినెస్ ప్రాసెసింగ్, లో-లైట్ గేమింగ్ బ్యాలెన్స్ మోడ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. కూలింగ్ కోసం ఫ్యాన్‌లెస్ ఆర్కిటెక్చర్‌ అందిస్తుంది. ఇందులో 12,070mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69/IP69K రేటింగ్‌ కూడా అందిస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
హానర్ విన్ టర్బో2 బ్యాక్ సైడ్ OIS సపోర్ట్, CIPA 6.0తో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ మ్యాజిక్‌ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆడియో కోసం ఇందులో డ్యూయల్ 1216 ఉంది. ఈ ఫోన్‌లో ఇండిపెండెంట్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంది. సేఫ్టీ కోసం 3డీ అల్ట్రాసోనిక్ అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ అందిస్తుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!