Telangana Eagle Force : మహారాష్ట్రలో రహస్య డ్రగ్స్ ల్యాబ్‌.. తెలంగాణ ఈగల్ ఫోర్స్ దెబ్బకు కదిలిన డ్రగ్స్ మాఫియా!

Must read

  • ఒక్క అరెస్టుతో కదిలిన డొంక.. మహారాష్ట్రలో డ్రగ్స్ ల్యాబ్ గుట్టురట్టు
  • తెలంగాణ టు మహారాష్ట్ర.. డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేసిన ఈగల్ ఫోర్స్
  • రహస్య ల్యాబ్‌లో మత్తు దందా.. 11 మంది అరెస్టు, 13 మంది పరారీ

Telangana Eagle Force : తెలంగాణలో డ్రగ్స్‌ తయారీ, సరఫరా వెనుక దాగిన అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ గుట్టు రట్టవుతోంది. మత్తు పదార్థాల తయారీకి రహస్యంగా ల్యాబ్‌ ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాపై తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మారేగవ్‌లో సాగుతున్నట్లు గుర్తించిన ఈ అక్రమ దందా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

బీబీనగర్‌ నుంచి మహారాష్ట్ర వరకు లింకులు :
ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై దర్యాప్తు ఆగస్టు 8న బీబీనగర్‌ పోలీసుల తనిఖీలతో కీలక మలుపు తిరిగింది. ఆ తనిఖీల్లో 27.2 కిలోల మెఫెడ్రోన్‌, 56.98 కిలోల అసిటోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొండమడుగు, మౌలాలి ప్రాంతాల్లోని ల్యాబ్‌లతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.

డ్రగ్స్‌ తయారీలో వినియోగించే ప్రొపియోనిల్‌ క్లోరైడ్‌ సరఫరా వ్యవహారంపై దృష్టి సారించడంతో దర్యాప్తు మరో కీలక దశకు చేరింది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన జేఎస్‌వీ గ్లోబల్స్‌ యజమాని జైరాజ్‌ కృష్ణ శెట్టిని అక్టోబర్‌ 17న ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Read Also : AP CM Chandrababu : దసరా వేళ సీఎం చంద్రబాబు సందేశం.. రైతన్న నుంచి యువత వరకు కీలక హామీ!

ఒక్క అరెస్టుతో బయటపడిన నెట్‌వర్క్‌ :
రసాయనాల సరఫరా, ల్యాబ్‌ నిర్వహణ, ప్రత్యేక పరికరాల సమకూర్పులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలోనే మహారాష్ట్రలోని మారేగవ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న ల్యాబ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడ డ్రగ్స్‌ తయారీకి ఉపయోగించినట్లు భావిస్తున్న పరికరాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

మెఫెడ్రోన్‌తో పాటు అల్ప్రాజోలమ్‌, ఎఫెడ్రిన్‌ తయారీకి సంబంధించిన ఆరోపణలపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో 13 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

తెలంగాణ, మహారాష్ట్రల్లో విస్తరించిన ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎన్ని లింకులు బయటపడతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్‌ తయారీ నుంచి సరఫరా వరకు ఎవరి పాత్ర ఎంత ఉందో దర్యాప్తు పూర్తయ్యాక స్పష్టత రానుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!