- ఆపిల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్
- రూ.89,900 ఫోన్ ఇప్పుడు రూ.73,999కే.. అమెజాన్‌లో అదిరే డీల్
- ఐఫోన్ ప్రియులకు పండగే.. ఐఫోన్ 16 ధరలో భారీ కోత
Apple iPhone 16 Price Drop : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ముఖ్యంగా ఐఫోన్ 16 మీ షాపింగ్ లిస్ట్‌లో ఉందా? అయితే, ఈ ఆఫర్‌పై ఓ లుక్కేయాల్సిందే.. ఆపిల్ అధికారిక వెబ్సైట్లో ధర పెరిగినప్పటికీ, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్ 16ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ ద్వారా మీ జేబుపై భారం మరింత తగ్గుతుంది. పూర్తి ఆఫర్ వివరాలివే..
ఐఫోన్ 16పై అదిరిపోయే డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 (128GB) రూ.76,999 ధరకు అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఆఫర్ కింద రూ.3వేలు తగ్గింపు వర్తిస్తే ధర రూ.73,999కు చేరుతుంది. మరోవైపు, ఆపిల్ అధికారిక వెబ్సైట్లో ఈ ఐఫోన్ ధర రూ.89,900గా ఉంది.
ఈ ధరలను పోల్చి చూస్తే.. బ్యాంక్ ఆఫర్‌తో అమెజాన్‌లో ఏకంగా రూ.15,901 వరకు ఆదా చేయవచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు, అర్హతలను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఈ సేల్ సమయంలో ధరలు, స్టాక్ కూడా మారే ఛాన్స్ ఉంది.
ఐఫోన్ 16 ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ఆపిల్ A18 చిప్సెట్ ఉన్నాయి. 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందించే డిస్ప్లే ఇందులో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం బ్యాక్ సైడ్ 48MP ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, USB Type-C పోర్ట్, 5G కనెక్టివిటీ కూడా ఉన్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని ఆపిల్ పేర్కొంది. మొత్తంగా, ప్రీమియం ఐఫోన్‌ను తక్కువ బడ్జెట్లో కొనాలనుకునేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఆర్డర్ చేసే ముందు ఫైనల్ ధర, బ్యాంక్ ఆఫర్, డీలర్ వివరాలను చెక్ చేయడం బెటర్..


