YS Jagan Mohan Reddy : ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని వినతి

Must read

YS Jagan Mohan Reddy : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లదాఖలు క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుంది.. తమ కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. కొందరు అధికారులు వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను తీసుకోవడం లేదని అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Vangaveeti Radha Krishna : విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా నామినేషన్

మీడియా సమావేశం అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ పునేఠాను కలిశారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని.. వైసీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని పలు ఆధారాలతో ఎస్ఈసీకి వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్‌ వేయకుండా వైసీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదని, పరిస్థితి ఇలా ఉంటే ఎస్‌ఈసీ ఏం చేస్తోందని అడిగామని వైఎస్‌ జగన్‌ వివరించారు.

నామినేషన్ ప్రక్రియలో పోలీసులు, అధికారులు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్‌ కేంద్రాల దగ్గరే పత్రాలు చించేస్తున్నారు. పారా మిలటరీ దళాలను దించాలని ఎస్‌ఈసీని కోరామని వైఎస్ జగన్ తెలిపారు. కేంద్ర బలగాలను దించాలని గవర్నర్‌నూ కోరాతామని అన్నారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌లో బ్యాలెట్‌ బాక్సులు మారుస్తారని అనుమానంగా ఉందని, స్ట్రాంగ్‌ రూమ్స్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని, కౌంటింగ్‌ హాల్‌లో కూడా సీసీ కెమెరాల నిఘా ఉండాలని కోరడం జరిగిందని చెప్పారు. 17cలో ఫోర్జరీ సంతకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరినట్లు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!