Vijay Rashmika : బతుకమ్మ ఆడటానికి వస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.. ఎప్పుడు? ఎక్కడ?

Must read

Vijay Rashmika : తెలంగాణలో బతుకమ్మ పండగను అందరూ ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో తెలిసిందే. ప్రభుత్వం కూడా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుంది. నేడు బతుకమ్మ పండగ చివరి రోజు సద్దుల బతుకమ్మ. తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ – రష్మిక రాబోతున్నారు.

విజయ్ – రష్మిక జంటగా తెరకెక్కిన రణబాలి సినిమా ఇటీవల రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ – రష్మిక రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్ వేస్తున్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ లోని ట్యాంక్ బ్యాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో విజయ్ – రష్మిక పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ టూరిజం అధికారికంగా ప్రకటించింది. దీంతో రష్మిక బతుకమ్మ ఆడటాన్ని చూడటానికి ఫ్యాన్స్, మహిళలు భారీగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Also Read : The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!