Vangaveeti Radha Krishna : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఆదివారం ఉదయం కూటమి తరపున విజయవాడ మేయర్ అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. తన కార్యాలయం నుంచి కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Also Read : YS Jagan : స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్.. చంద్రబాబూ నీకు ఆ దమ్ములేదా? అంటూ ప్రశ్న..
అనంతరం వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆమోదంతో మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచానని.. విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనను కూటమి అభ్యర్థిగా ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ప్రత్యేక కతృజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, పవన్, విజయవాడ నగరంలోని ఎమ్మెల్యేల సహకారంతో విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, నగరానికి మంచి పేరు తీసుకొస్తామని పేర్కొన్నారు.


