DA Hike 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపుతో అక్టోబర్ జీతం ఎంత పెరుగుతుందంటే!

Must read

  • దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్?
  • నెల జీతంలో భారీ మార్పు? డీఏ పెరిగితే జీతం ఎంతంటే?
  • 3శాతం డీఏ పెంపుతో మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

DA Hike 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళికి ముందే తీపి కబురు అందనుందా? దేశవ్యాప్తంగా దాదాపు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR) పెంపుపై ఉత్కంఠ నెలకొంది.

జూలై 1, 2026 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ పెంపుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈసారి డీఏ 3 శాతం పెరిగి 60 శాతం (DA Hike 2026) నుంచి 63 శాతానికి చేరవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ జీతంలో ఎంత అదనం? :
డీఏ 3 శాతం పెరిగితే ఉద్యోగుల చేతికి వచ్చే జీతంలో ఎంత మార్పు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రూ.18వేల కనీస వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.540 అదనంగా పొందవచ్చు. అంటే ఏడాదికి రూ.6,480 బెనిఫిట్ ఉంటుంది. అదే రూ.25,500 కనీస వేతనానికి నెలకు రూ.765, ఏడాదికి రూ.9,180 అదనంగా అందవచ్చు.

రూ.35,400 మూల వేతనం ఉన్న ఉద్యోగులకు డీఏ 3శాతం పెరిగితే నెలకు రూ.1,062 అదనంగా లభిస్తుంది. అదే విధంగా, రూ.44,900 కనీస వేతనం ఉన్నవారికి నెలకు రూ.1,347, రూ.56,100 కనీస వేతనం ఉన్నవారికి నెలకు రూ.1,683 అదనంగా అందుతుంది. అయితే, ఈ పెంపుపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read Also : Airtel Recharge Plans : డేటా వాడని వారికి పండగే.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి 3 సరికొత్త ప్లాన్లు..!

బకాయిలు కూడా చేతికి :
ఈ పెంపు జూలై 1 నుంచి అమలైతే, ఆ తేదీ నుంచి వర్తించే బకాయిలు కూడా ఉద్యోగులకు అందే అవకాశం ఉంది. ఉదాహరణకు.. రూ.18వేల కనీస వేతనం ఉన్న ఉద్యోగికి 3 నెలలకు రూ.1,620 బకాయిలు రావచ్చు. పెన్షనర్లకు కూడా డీఆర్ బకాయిలు వర్తించే అవకాశం ఉంది.

దీపావళికి ముందే ప్రకటన వస్తుందా? :
ఉద్యోగ సంఘాలు పెండింగ్ డీఏ, డీఆర్‌తో పాటు దీపావళి బోనస్‌ను త్వరగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 30 రోజుల తాత్కాలిక బోనస్, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది.

అయితే, డీఏ పెంపు విషయంలో అధికారిక ఆమోదం అవసరం. అక్టోబర్ 21న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారా? దీపావళికి ముందే జీతాలు పెరుగుతాయా? అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!