Jake Fraser-McGurk : ఆస్ట్రేలియా యువ విధ్వంసక బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ చరిత్ర సృష్టించాడు. ఆసీస్ తరపున లిస్ట్ – ఎ క్రికెట్లో దేశీ వన్డేకప్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్గా నిలిచాడు. క్వీన్స్లాండ్తో జరిగిన వన్డేకప్ మ్యాచ్లో కేవలం 14 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, ఈ జాబితాలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిస్థానంలో ఉండగా.. మెగర్క్ నాల్గో స్థానంలో నిలిచాడు. అయితే, అతను సౌత్ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్లాండ్పై 14 బంతుల్లో ఫిఫ్టీ చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర నెలకొల్పాడు.
క్వీన్స్లాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌత్ ఆస్ట్రేలియా ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, మెకెంజీ హార్వే ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కేవలం 21 బంతుల్లోనే జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చారు. అనంతరం 44 బంతుల్లోనే శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. హార్వే 46 పరుగులు చేసి ఔటైనా, మెక్గుర్క్ తన దూకుడును కొనసాగించాడు. అప్పటికే కేవలం 14బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్న జేక్ ఫ్రేజర్ మెగర్క్ చివరకు 63 బంతుల్లో 122 పరుగులు చేసి వెనుదిరిగాడు.
లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్లు..
వైభవ్ సూర్యవంశీ- ఇండియా- ‘ఎ’ తరఫున శ్రీలంక- ‘ఎ’పై 2026లో 11 బంతుల్లో ఫిఫ్టీ
కౌశల్య వీరరత్నె- రాగమ తరఫున కరునెగలపై 2005-06లో 12 బంతుల్లో ఫిఫ్టీ
తిశారా పెరీరా- శ్రీలంక ఆర్మీ తరఫున బ్లూమ్ఫీల్డ్పై 2020-21లో 13 బంతుల్లో
రోరీ క్లెవిన్వెల్ట్- వెస్టర్న్ ప్రావిన్స్ తరఫున క్వాజులూ నాటల్పై 2010-11లో 14 బంతుల్లో
జేక్ ఫ్రేజర్ మెగర్క్- సౌత్ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్లాండ్పై 2026లో 14 బంతుల్లో ఫిఫ్టీ.


