Harish Rao: గోదావరి జలాలపై చంద్రబాబు కుట్ర.. నీటి ఉద్యమం చెయ్యాల్సిందే.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

Must read

Harish Rao: నవంబర్ 3న జరగబోయే ఎన్‌బీడీఏ సమావేశం ఎజెండాలో గోదావరి-కావేరి నదుల అనుసంధానం అంశాన్ని చేర్చడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7న లేఖ రాయగానే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చడం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను కబళించేందుకు యత్నిస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ‘గురుదక్షిణ’గా మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.

Anirudh-Kavya Maran Wedding: ‘కావ్య మారన్- అనిరుద్‌’ పెళ్లి ఫిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న ఇద్దరి ఆస్తుల వివరాలు.. ఎన్ని వందలకోట్లో తెలుసా?

బొల్లేపల్లి ప్రాజెక్ట్‌తో అన్యాయం.. సమ్మక్క సాగర్ డిపిఆర్‌పై నిర్లక్ష్యం:

సమ్మక్క సాగర్ ద్వారా నదుల అనుసంధానం జరిగితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, కానీ ఏపీ కంట్రోల్‌లో ఉండే బొల్లేపల్లి ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్ లింకింగ్ చేయడానికి కేంద్రం ప్రతిపాదించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమ్మక్క సాగర్‌కు సగం అనుమతులు తెచ్చామని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా వెనక్కి వచ్చిందని ధ్వజమెత్తారు. దేవాదుల నీళ్లను కిందికి వదిలేసి తెలంగాణకు క్రాప్ హాలిడే పరిస్థితులు తెచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఎంపీల మౌనంపై నిలదీత.. నీటి హక్కుల కోసం మరో పోరాటం:

ఎన్డీయేలో ఏపీకి చెందిన 16 మంది ఎంపీలు ఉండటంతోనే కేంద్రం వారి మాట వింటోందా అని ప్రశ్నించిన హరీష్ రావు, తెలంగాణ నుంచి గెలిచిన 17 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర నీటి వాటాలను కాపాడుకోవడంలో విఫలమైతే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అవసరమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరొక భారీ నీటి ఉద్యమాన్ని చేపడతామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!