
- ఇక అకౌంట్ అవసరం లేదు.. లింక్‌తోనే కాల్లోకి
- 32 మందితో ఫ్రీ కాల్స్.. ఎలా వాడాలంటే?
- బిగ్ అప్డేట్.. అకౌంట్ లేని వారితోనూ వీడియో కాల్స్
WhatsApp Guest Calling : స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ అకౌంట్ లేని వారితో కూడా వాయిస్, వీడియో కాల్స్‌లో మాట్లాడొచ్చు. మెటా ‘వాట్సాప్ గెస్ట్ కాలింగ్’ (WhatsApp Guest Calling) ఫీచర్ ప్రవేశపెట్టింది.
ఇకపై వాట్సాప్ అకౌంట్ లేకుండానే మీ ఫోన్ కాల్స్‌లో జాయిన్ అవ్వొచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, వాట్సాప్ వాడని బంధువులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వాట్సాప్ గెస్ట్ కాలింగ్ ఏంటి? :
వాట్సాప్ గెస్ట్ కాలింగ్ అనేది యూజర్లు తమ వీడియో కాల్లో జాయిన్ అయ్యేందుకు ఇతరులకు లింక్ పంపవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఫ్రీగా వాయిస్, వీడియో కాల్స్‌లో జాయిన్ అవ్వొచ్చు. అంతేకాదు, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సింగిల్ కాల్లో గరిష్ఠంగా 32 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది.
Read Also : EPFO Big Update : రూ.25 వేల జీతం ఉన్నవారికి పెన్షన్ వస్తుందా? రాదా? ఈపీఎఫ్ఓ రూల్స్ తెలుసుకోండి!
కాల్ లింక్‌ను ఎలా క్రియేట్ చేయాలి? :
ముందుగా మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి ‘Calls’ ట్యాబ్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘+’ ఐకాన్‌పై క్లిక్ చేసి కాల్ లింక్‌ను క్రియేట్ చేయాలి. ఆ లింక్‌ను మీరు మాట్లాడాలనుకుంటున్న వారికి షేర్ చేయాలి. ఆ లింక్‌ను ఓపెన్ చేసి కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా కాల్లో జాయిన్ అవ్వొచ్చు. ఇందుకోసం వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
గెస్ట్ కాలింగ్‌లో ప్రైవసీ ఎలా? :
గెస్ట్ కాలింగ్‌లో సేఫ్టీ కూడా ఉంటుంది. వాట్సాప్ కాల్లో చేరిన గెస్టులు ఇతర పార్టిసిపెంట్ల ఫోన్ నంబర్లను చూడలేరు. అలాగే మెసేజ్ పంపడం, ఇతరులను కాల్‌కు ఇన్వైట్ చేయడం వంటి చేయలేరు. హోస్ట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గెస్టులు కాల్లోకి ఎంట్రీ ఇవ్వగలరు. అవసరమైతే హోస్ట్ వారిని కాల్ నుంచి రిమూవ్ చేయొచ్చు.
అదిరిపోయే ఫీచర్లు :
గెస్ట్ కాల్ సమయంలో స్క్రీన్‌ను షేర్ చేయడం, ఎమోజీలతో రెస్పాండ్, ప్రశ్నలు అడగడానికి హ్యాండ్స్ పైకెత్తడం వంటివి వాడొచ్చు. ఆపిల్ ఫేస్‌టైమ్ కాలింగ్ మాదిరిగా ఈ విధానం ఉంటుంది. మొత్తానికి, వాట్సాప్ అకౌంట్ లేని వారితోనూ ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ అవసరం. అయితే ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో వాట్సాప్ వెర్షన్, రోల్అవుట్ ఆధారంగా ఉంటుంది.


