New Electric Car Offers : పండక్కీ కొత్త కారు కొనాలా? రూ.4.69 లక్షల నుంచే ఎలక్ట్రిక్ కారు.. బెస్ట్ 4 EV కార్లు ఇవే!

Must read

New Electric Car Offers
  • ఈ దీపావళికి రూ. 10 లక్షల లోపు ధరకే ఎలక్ట్రిక్ కారు కొనండి
  • టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ పంచ్ ఈవీ వంటి ఆప్షన్లు
  • ఎంజీ విండ్సర్ ఈవీ BaaS ఆప్షన్‌తో తక్కువ ప్రారంభ ధరకే
  • బ్యాటరీ రెంటల్‌తో చౌకగా కారు.. MG, టాటా EVల పూర్తి వివరాలు

New Electric Car Offers : దీపావళి పండుగ వచ్చేస్తోంది.. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లోనే ఎలక్ట్రిక్ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు.. టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ, టాటా పంచ్ ఈవీతో పాటు ఎంజీ విండ్సర్ ఈవీ కూడా బ్యాటరీ రెంటల్ ఆప్షన్‌ (BaaS)తో ఆకర్షణీయమైన ప్రారంభ ధరలకు లభిస్తోంది. ఈ పండుగకు మీ బడ్జెట్‌లో సరిపోయే ఎలక్ట్రిక్ కార్లు ఏమి ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం..

1. టాటా టియాగో ఈవీ.. తక్కువ ధరలో బెస్ట్ ఛాయిస్ :
బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నవారికి టాటా టియాగో ఈవీ బెస్ట్ కారు.. ధరల వివరాల (New Electric Car Offers) ప్రకారం.. BaaS ఆప్షన్‌తో ప్రారంభ ధర రూ.4.69 లక్షలు. అయితే, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.2.60 అదనంగా చెల్లించాలి.

సాధారణ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.99 లక్షలు మాత్రమే.. ఇందులో 19.2kWh, 24kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. భారీ బ్యాటరీ వేరియంట్ 315 కిలోమీటర్ల వరకు MIDC రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Apple iPhone 17 Pro : సూపర్ ఆఫర్ భయ్యా.. ఐఫోన్ 17 ప్రో ఇలా కొన్నారంటే రూ.13వేలు తక్కువకే.. ఈ డీల్ మిస్ చేయొద్దు..!

2. ఎంజీ కామెట్ ఈవీ.. సిటీ రైడ్స్‌కు సూపర్ :
రోజువారీ నగర ప్రయాణాల కోసం కాంపాక్ట్ ఈవీ కావాలనుకునేవారికి ఎంజీ కామెట్ ఈవీ సరైన ఆప్షన్. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షలు. 17.4kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ARAI ప్రకారం 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. BaaS ప్లాన్‌తో ప్రారంభ ధర రూ.4.99 లక్షలు కాగా, ప్రతి కిలోమీటరుకు రూ.3.20 బ్యాటరీ ఛార్జీ అదనంగా చెల్లించాలి.

3. టాటా పంచ్ ఈవీ.. SUV లుక్‌తో ఎలక్ట్రిక్ డ్రైవ్ :

SUV తరహా డిజైన్‌ ఇష్టపడేవారికి టాటా పంచ్ ఈవీ ఆకర్షణీయమైన ఆప్షన్. ప్రారంభ ధర సుమారు రూ.9.69 లక్షలు. BaaSతో రూ.6.49 లక్షల నుంచి ఉంటుంది. బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.2.60 అదనంగా చెల్లించాలి. 30kWh, 40kWh బ్యాటరీ ఆప్షన్లతో లభించే ఈ కారు, వేరియంట్‌ను బట్టి 468 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

4. ఎంజీ విండ్సర్ ఈవీ.. రూ.9.99 లక్షలకేనా? :
ఎంజీ విండ్సర్ ఈవీ సాధారణ ధర రూ.10 లక్షలకు పైనే ఉన్నప్పటికీ, BaaS ఆప్షన్‌తో రూ.9.99 లక్షల ప్రారంభ ధరకు లభిస్తుంది. అయితే, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.99 అదనం. ఇందులో 38kWh, 52.9kWh బ్యాటరీ ఆప్షన్లు, ఐదుగురు కూర్చునే సౌకర్యం, వేరియంట్‌ను బట్టి భారీ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ముఖ్య గమనిక : ఈ కార్లపై ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.. BaaSలో బ్యాటరీ వినియోగ ఛార్జీలు అదనం. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు కూడా ఉండొచ్చు. కొనుగోలు చేసే ముందు లోకల్ డీలర్ వద్ద లేటెస్ట్ ధరలు, ఆఫర్లు, వేరియంట్ల లభ్యతపై ఓసారి లుక్కేయండి..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!