6 Best Yamaha Bikes : రూ. 2 లక్షల లోపు యమహా బైక్స్.. మైలేజ్, స్టైలింగ్, స్పీడ్‌.. మీకు ఏది సెట్ అవుతుంది?

Must read

6 Best Yamaha Bikes
  • తక్కువ బడ్జెట్‌లో 6 అదిరిపోయే బైక్స్
  • మైలేజ్ కావాలా? స్పీడ్ కావాలా? మీకో బెస్ట్ ఆప్షన్!
  • FZ-S నుంచి R15 V4 వరకు రూ. 2 లక్షల లోపు ఏ బైక్ బెస్ట్?

6 Best Yamaha Bikes : కొత్త బైక్ కొనాలని చూస్తున్నారా? బడ్జెట్ రూ. 2 లక్షల లోపేనా? అయితే యమహా బైకుల లైనప్‌లో మీకోసం 6 ఆసక్తికరమైన ఆప్షన్లు ఉన్నాయి. FZ-S Fi నుంచి స్పోర్టీ R15 V4 వరకు.. మైలేజ్, స్టైలింగ్, పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు నచ్చిన బైక్‌ను ఎంచుకోవచ్చు.

1. Yamaha FZ-S Fi :
FZ-S Fi వెర్షన్ 4.0 DLX ధర సుమారు రూ. 1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్). హైబ్రిడ్ వెర్షన్ ధర సుమారు రూ. 1.41 లక్షలు. 149cc ఇంజిన్, 138 కిలోల బరువు, 790mm సీటు ఎత్తుతో నగర ప్రయాణాలకు ఇది అద్భుతమైన బైక్.. 53.44kmpl అనేది ARAI మైలేజ్ క్లెయిమ్ అందిస్తుంది. రియల్ మైలేజ్ రైడింగ్ కండిషన్లపై ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఛాయిస్ అనమాట..

2. Yamaha FZ-X :
రూ. 1.26 లక్షల నుంచి రూ. 1.34 లక్షల వరకు ధరతో లభించే FZ-X, హైబ్రిడ్ సిస్టమ్ లేకుండా ప్రత్యేకమైన నియో-రెట్రో (6 Best Yamaha Bikes) స్టైలింగ్‌ను అందిస్తుంది. రెట్రో లుక్స్‌లో అదరగొట్టేయొచ్చు..

3. యమహా FZ-X Hybrid :
సుమారు రూ. 1.45 లక్షల ధరతో లభించే ఈ బైక్‌లో స్టైల్‌తో పాటు టెక్నాలజీ అద్భుతంగా ఉంటుంది. అలాగే 149cc హైబ్రిడ్ సెటప్ ఉంటుంది. సుమారు 53kmpl మైలేజ్ అంచనా మాత్రమే.

Read Also : WhatsApp Guest Calling : వావ్.. వాట్సాప్‌లో కొత్త గెస్ట్ కాలింగ్‌ ఫీచర్.. ఇక అకౌంట్ లేకున్నా ఫ్రీగా వాయిస్, వీడియో కాల్స్‌లో చేరొచ్చు!

4. యమహా XSR 155 క్లాసిక్ లుక్.. స్పోర్టీ పవర్ :
రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.63 లక్షల ధరతో లభించే XSR 155లో 155cc ఇంజిన్ 18.14hp పవర్, 14.2Nm టార్క్‌ను అందిస్తుంది. రౌండ్ LCD, Y-కనెక్ట్ బ్లూటూత్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

5. యమహా MT-15 V2 :
రూ. 1.66 లక్షల ప్రారంభ ధరతో లభించే MT-15 V2లో యూత్‌కు పవర్‌ఫుల్ ఛాయిస్.. 18.14 hp ఇంజిన్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. అయితే, టీఎఫ్టీ డిస్‌ప్లే, నావిగేషన్ ఫీచర్లు వేరియంట్‌ను బట్టి మారతాయి.

6. యమహా ఆర్15 V4 :
స్పోర్ట్స్ బైక్ లవర్స్ కోసం రూ. 1.75 లక్షల నుంచి రూ. 1.79 లక్షల ధరతో లభించే ఆర్15 V4 ఈ లిస్టులో ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్. 18.14hp పవర్, 11-లీటర్ల ట్యాంక్, ఎంపిక చేసిన వేరియంట్లలో క్విక్ షిఫ్టర్ ఆకర్షణలుగా చెప్పొచ్చు.

ఏ బైకు కొనాలి? మైలేజ్, రోజువారీ ప్రయాణాలకు FZ-S Fi, రెట్రో స్టైల్‌కు FZ-X, స్పోర్టీ పర్ఫార్మెన్స్ కోసం MT-15 V2, రేసింగ్ లుక్‌కు R15 V4ను చెక్ చేయొచ్చు. షోరూమ్‌లో లేటెస్ట్ ధరలు, వేరియంట్లు, ఆన్-రోడ్ ఖర్చుల విషయంలో మర్చిపోవద్దు..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!