శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Must read

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ సమర్పణలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’. తల్లాడ సాయికృష్ణ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.విభిన్నమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

సినిమా మంచి విజయం సాధించాలి: శ్రీకాంత్

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ టైటిల్ చాలా విభిన్నంగా ఉందన్నారు. టైటిల్‌కు తగ్గట్టుగానే చిత్ర బృందానికి కూడా మంచి మ్యాజిక్ జరగాలని ఆకాంక్షించారు.సినిమా మంచి విజయం సాధించి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ శ్రీకాంత్ శుభాకాంక్షలు అందించారు.

‘మహాత్మా’ తరహాలో మ్యాజిక్ జరగాలి: తల్లాడ సాయికృష్ణ

దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తమ సినిమా ఫస్ట్ లుక్‌ను శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.17 ఏళ్ల క్రితం ఇదే రోజున ‘మహాత్మా’ సినిమా విడుదలైంది. ఆ సినిమా తమలాంటి ఎంతోమందికి ఎంతో ఇష్టమని తెలిపారు. ‘మహాత్మా’ సినిమా విజయంతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అయిందో, తమ ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ సినిమాకు కూడా అలాంటి విజయమే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.తమ సినిమాకు శ్రీకాంత్ మద్దతు లభించేలా సహకరించిన నటుడు చిట్టికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం చిత్ర బృందానికి ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో నటుడు వినోద్ నువ్వుల, ప్రణయ్ రాజ్ వంగరి, రాము, ఎడిటర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు

తల్లాడ సాయికృష్ణ, ఏకదంతాయ సిరి, వాసు ఇంటూరి, 30 ఇయర్స్ పృథ్వి, సీనియర్ నటి శ్రీలక్ష్మి, జబర్దస్త్ జీవన్, కిషోర్ దాస్, ఆకెళ్ల, జబర్దస్త్ అప్పారావు, వినోద్ నువ్వుల, గడ్డం నవీన్, చంద్ర సుబ్బగారి, వెంకట్ దుగ్గిరెడ్డి, స్వప్న అమ్మినేని, తల్లాడ వెంకన్న, అను, భాను, శోభన్ భోగరాజు తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు

కెమెరా: శివ రాథోడ్
రచన: జీవన్ కందుల
ఎడిటింగ్: మోహన్
డీఐ: రోహిత్
ఆడియోగ్రఫీ: ఎస్.ఎస్. వెంకట్
ఎస్‌ఎఫ్‌ఎక్స్: వెంకట్
సహా నిర్మాత: వెంకట్ దుగ్గిరెడ్డి
నిర్మాత: తల్లాడ శ్రీనివాస్
సమర్పణ: కె. దశరథ్
కథ–కథనం–దర్శకత్వం: తల్లాడ సాయికృష్ణ

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!