వరుస ఫ్లాపులతో ఆమిర్ ఖాన్.. గ్రాండ్ కంబ్యాక్ కోసం భారీ ప్లాన్!

Must read

బాలీవుడ్‌లో ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం కెరీర్‌లో మరో కీలక దశలో ఉన్నారు. షారుఖ్ ఖాన్ వరుస విజయాలతో దూసుకెళ్తుండగా, సల్మాన్ ఖాన్ కూడా సాలిడ్ కంబ్యాక్ కోసం సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాన్ త్రయంలో ఒకరైన ఆమిర్ ఖాన్ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఆమిర్ ఖాన్‌కు గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడంలో ఆయన గ్యాప్ తీసుకున్నారు. గత ఏడాది ‘సితారే జమీన్ పర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. గతంలో ఆమిర్ సినిమాలకు వచ్చిన స్థాయిలో సంచలన స్పందన రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

2016లో వచ్చిన ‘దంగల్’ తర్వాత ఆమిర్ ఖాన్ కెరీర్‌లో హీరోగా సినిమాల సంఖ్య కూడా తగ్గింది. మధ్యలో క్యామియో పాత్రలు, నిర్మాణ బాధ్యతలపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. సౌత్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’లోనూ గెస్ట్ రోల్‌లో కనిపించారు. అయితే ఆ పాత్ర ఆయన కెరీర్‌కు పెద్ద కంబ్యాక్‌గా నిలవలేకపోయింది.ఒకప్పుడు ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘దంగల్’ వంటి భారీ విజయాలతో భారతీయ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఆమిర్.. ఇప్పుడు తన తదుపరి సినిమాను అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోగా గ్యాప్ తీసుకున్న సమయంలో ఆయన నిర్మాణంలో వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.ఈ నేపథ్యంలో ఎలాగైనా భారీ విజయంతో తిరిగి రావాలని ఆమిర్ ఖాన్ ప్రయత్నిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని సూపర్ హీరో కాన్సెప్ట్‌తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌కు ఆర్. బాల్కి దర్శకత్వం వహించే అవకాశం ఉందని, సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న వివరాలను కేవలం ఇండస్ట్రీ రిపోర్టులు, ప్రచారంగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. ‘కూలీ’ తర్వాత సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించాలనే ఆలోచన ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదని, ఆమిర్ ఖాన్‌కు కథ నచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి.ప్రస్తుతం ఆమిర్ ఖాన్ నుంచి అధికారికంగా ఏ ప్రాజెక్ట్ ఖరారవుతుందనేది ఆసక్తికరంగా మారింది. సూపర్ హీరో కథతో వస్తారా? లేక పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుంటారా? అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!