Friday, June 26, 2026

బండచెరువు వాకర్స్ పార్కులో అభివృద్ధి పనులకు శ్రీకారం

Must read

వినాయక్‌నగర్ పరిధిలోని బండచెరువు వాకర్స్ పార్కులో సుమారు రూ.16 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ నిధులతో పార్కులో ర్యాంప్, మెట్లు, చెరువులోకి దిగేందుకు ప్రత్యేక మెట్లు, పార్కింగ్ స్థలం, ఆర్చ్ నిర్మాణం తదితర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.ఈ కార్యక్రమంలో లాల్వాని నగర్ కాలనీ అధ్యక్షుడు నరేష్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్ గౌళికర్, ఓం ప్రకాష్, సంతోష్, అలాగే పార్టీ నాయకులు జగదీష్ చారి, సాయి సురేష్, గోపాల్, ఉమా కాంత్ హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం ఏఈ నవీన్ కుమార్, సూపర్‌వైజర్లు సాగర్, వెంకటేష్, హార్టికల్చర్ సూపర్‌వైజర్ వెంకటేష్ తదితరులు పాల్గొని పనుల వివరాలను తెలియజేశారు.పార్కు అభివృద్ధితో స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కార్పొరేటర్ తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!