Friday, June 26, 2026

వైభవంగా నటుడు విశాల్ – సాయి ధన్సిక నిశ్చితార్థం

Must read

తమిళ సినీ నటుడు, నిర్మాత విశాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్, ప్రేమ చదరంగం సినిమాతో తెరంగేట్రం చేసి, పందెంకోడి, భరణి, సల్యూట్ వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోగా నిలిచాడు. తాజాగా మార్క్ ఆంటోనీ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు.
అభినయంలో విజయాలు సాధిస్తున్న విశాల్, నటి సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నానని ప్రకటించగా, నేడు తన పుట్టినరోజు రోజునే నిశ్చితార్థం చేసుకున్నారు. చెన్నైలో సన్నిహిత బంధువులు, మిత్రుల సమక్షంలో, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో వేదపండితుల సాక్షిగా విశాల్, ధన్సికకు ఉంగరం తొడిగారు.తన ఎక్స్‌ ఖాతాలో విశాల్ నిశ్చితార్థ ఫొటోలను పంచుకుంటూ – “నా ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ధన్సికతో జరిగిన నా నిశ్చితార్థం గురించి శుభవార్తను మా కుటుంబాల మధ్య మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పటిలాగే మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. సాయి ధన్సిక కబాలి సినిమాలో రజినీకాంత్ కుమార్తెగా, అలాగే దక్షిణ వంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!