Friday, June 26, 2026

ఆధారాలుంటే బయటపెట్టు — సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

Must read

“నాపై డ్రగ్స్ కేసు ఉందని ఎవరు అంటున్నారు? అలాంటి కేసులతో నాకేమైనా సంబంధాలున్నాయా? ఏమైనా ఆధారాలు ఉంటే దమ్ముంటే బయటపెట్టు” అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీటుగా సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిపిన చిట్‌చాట్‌లో తనపై అసత్య ఆరోపణలు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. “నేరుగా ఎదురుగా నిలబడే ధైర్యం లేక చిట్టచాట్లతో నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రేవంత్ రెడ్డికి కొత్త కాదని వ్యాఖ్యానించారు.

“కోర్టుకు లాగుతాను… క్షమాపణలు చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి”
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానని కేటీఆర్ హెచ్చరించారు. “తప్పుడు ఆరోపణలు చేసిన వారెవరిదైనా, వారు చట్టపరంగా బాధ్యత వహించక తప్పదు. క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రాజకీయ విమర్శలు మరింత తేలికపాటి మాటలకూ దిగజారుతున్నాయన్న ఆరోపణలు మధ్య, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!