Saturday, June 6, 2026
Google search engine

జానీ మాస్టర్ ఈస్ బ్యాక్

Must read

గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్ట్, జైలు జీవితం, బెయిల్ తదితర అంశాలతో వార్తల్లో నిలిచిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్… ఇప్పుడు మళ్లీ సినీ రంగంలో అడుగులు వేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన, బెయిల్ మీద బయటకి వచ్చాక కొంతకాలం కన్నడ, హిందీ సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు.

తాజాగా తనకు స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చిన టాలీవుడ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రంలో ఒక మాస్ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో, ఇటీవల ఈ మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి అయినట్టు సమాచారం. షూటింగ్ ముగిసిన అనంతరం హీరోయిన్ శ్రీలీల, జానీ మాస్టర్‌కు బొకే పంపి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. దీనికి స్పందనగా జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ఖాతాలో, “థాంక్యూ శ్రీలీల గారు. మీతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం. మాస్ జాతరలో మీరు, రవితేజ గారు చేసిన మాస్ స్టెప్స్ కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేశారు.

ఈ ఫోటోల్లో శ్రీలీల లంగా ఓణీలో మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. జానీ మాస్టర్ సినీ రంగంలో మళ్లీ బిజీ కావాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు, వాదనలు ఎంతగా దెబ్బతీశాయన్నా… జానీ మాస్టర్ టాలెంట్‌ను మాత్రం ఒదిలిపెట్టలేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ‘మాస్ జాతర’ చిత్రం ద్వారా ఆయనకు మళ్లీ గ్లామర్ రీఎంట్రీ లభిస్తుందనే ఆశాభావం సినీ వర్గాల్లో కనిపిస్తోంది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!