Saturday, June 6, 2026
Google search engine

లార్డ్స్ టెస్ట్‌లో భారత్ పోరాడి ఓటమి

Must read

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో భారత జట్టు పోరాడినా, 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విజయం కోసం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌… 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. రవీంద్ర జడేజా మాత్రమే మిడిలార్డర్‌లో ఒంటరిగా పోరాడుతూ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లు డబుల్ డిజిట్‌కు కూడా చేరకుండానే పెవిలియన్‌కు చేరిపోయారు. బౌలింగ్ ఆల్‌రౌండర్ జస్‌ప్రీత్ బుమ్రా 54బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ కాగా, మహ్మద్ సిరాజ్ 4 పరుగులు చేశాడు.
ఇతర బ్యాటర్లు—
• నితీష్ కుమార్ రెడ్డి – 13పరుగులు
• వాషింగ్టన్ సుందర్ – డక్కౌట్
• కేఎల్ రాహుల్ – 39 పరుగులు
• రిషబ్ పంత్ – 9 పరుగులు

అంతకుముందు, ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసి భారత్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్‌లలో రెండు జట్లు 387 పరుగుల స్కోరుతో సమానంగా నిలిచాయి, మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
రెండు జట్ల ప్లేయింగ్ XI:
భారత్ జట్టు:
శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఈ ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా, మిగిలిన రెండు టెస్టుల్లో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పోటీలోకి రావాలన్న ఉద్దేశంతో సిద్ధమవుతోంది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!