Friday, June 26, 2026

‘ది 100’ ట్రైలర్ లాంచ్ చేసిన పవన్ కల్యాణ్

Must read

ఆర్కే సాగర్ కథానాయకుడిగా, మిషా నారంగ్ కథానాయికగా రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది 100’ జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. “జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేం… కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపొచ్చు…” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికర మలుపులతో రసవత్తరంగా సాగుతోంది.

ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎస్ విక్రాంత్‌గా కనిపించనున్నాడు. ఆయుధాన్ని ఉపేక్షించాలని స్వయంగా నిర్ణయం తీసుకున్న విక్రాంత్‌ జీవితం అప్పుడు ఎలా మారింది? ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన పరిస్థితి ఏంటి? మళ్లీ ఆయుధం అందుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్న సంగతులు తెలుసుకోవాలంటే జులై 11న విడుదలయ్యే ‘ది 100’ చిత్రాన్ని మిస్సవకూడదు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!