Friday, March 6, 2026
spot_imgspot_img

తెలంగాణలో జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకోం : సుందర్ కల్లూరి

Must read

తెలంగాణలోని ప్రతీ జర్నలిస్ట్ కి న్యాయం జరగాలని రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులు, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా అంటూ వేరు చేయడం తగదని, జీవో 252 ని పునఃసమీక్షించాలని, అర్హులైన ప్రతీ జర్నలిస్ట్ కి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ జర్నలిస్టులకు అందాలని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుందర్ కల్లూరి డిమాండ్ చేసారు.

తెలంగాణ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ల జోలికి వస్తే మాత్రం ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. మీకు జరిగిన ఇబ్బంది మా దృష్టికి తీసుకొస్తే, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం మీ దగ్గరికి వచ్చి మీకు కొండంత అండగా ఉంటుందని జర్నలిస్టులందరికీ భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యక్షుడు సుందర్ కల్లూరి, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కీర్తీ సంతోష్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్, గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!