Friday, March 6, 2026
spot_imgspot_img

ఉప్పల్‌లో “ఉస్తాద్ రెస్టారెంట్” ప్రారంభం

Must read

ఉప్పల్ నియోజకవర్గంలోని సాకేత్ రోడ్ వద్ద పద్మశాలి టౌన్‌షిప్ లో నూతనంగా ఏర్పాటైన ఉస్తాద్ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “ఇలాంటి నూతన వ్యాపారాలు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడతాయి. ఉస్తాద్ రెస్టారెంట్ విజయవంతంగా నడవాలని, నిర్వాహకులు వ్యాపార రంగంలో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం,” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!