ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చర్లపల్లి డివిజన్ పరిధిలోని కాలనీలలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల జోనల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
చర్లపల్లి డివిజన్‌లోని రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ, కృష్ణనగర్, MRR కాలనీలకు గల ప్రధాన సమస్య అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ లేకపోవడమే. ఎన్నో ఏళ్లుగా వర్షాకాలంలో నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా NOC లభించడంతో ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జోన్ కమిషనర్‌కి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో BRS పార్టీ నేత మహేష్ గౌడ్, రెడ్డి కాలనీ అధ్యక్షుడు భూమిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, జీవన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెలుమ్ రెడ్డి, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపాదిత UGD పనులకు త్వరలోనే శంకుస్థాపన జరగాలని, కాలనీల ప్రజలకు శాశ్వతంగా సమస్యల నుంచి ఉపశమనం కలగాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




