కాప్రా ప్రెస్ క్లబ్ వినాయక మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుని ఆశీస్సులు అందరికీ కలగాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విలేకరులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, “వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయి. గణనాథుడు విద్య, విజయాలకు ప్రతీక. ఇలాంటి వేడుకలు జరపడం ద్వారా సమాజంలో సత్సంకల్పాలు పెరుగుతాయి. జర్నలిస్టులు సమాజానికి అద్దం లాంటివారు. ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా ప్రతిబింబిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతున్న కృషి అభినందనీయం” అని అన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, కుమారస్వామి, ప్రెస్ క్లబ్ సభ్యులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి, బేలిదే అశోక్, పటేల్ నర్సింహులు, ముత్యం ముఖేష్, రామచంద్ర మూర్తి, డి. శ్రీనివాసరావు, గంగి కృష్ణ, ఓ. నర్సింహ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గణనాథుని ఆశీస్సులతో సమాజంలో ఐక్యత పెరుగుతుంది – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి




