పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రతిష్ఠాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్‌ను పొందింది. చిత్ర రన్‌టైమ్ 2 గంటల 42 నిమిషాలు. ఈ చిత్రం జులై 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.విడుదలకు ముందుగా, జులై 20న విశాఖపట్నంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక పవర్‌ఫుల్ పాటతో పాటు చిత్ర నిర్మాణ దృశ్యాలు విడుదల చేయనున్నారు.ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి ప్రాథమికంగా దర్శకత్వం వహించగా, మిగిలిన భాగాన్ని ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాను, చారిత్రక నేపథ్యం, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ నేతృత్వంలో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్, కీలక పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయని అంచనా.మూడేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ బిగ్ స్క్రీన్ పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నెలకొంది. ‘హరి హర వీరమల్లు’ విడుదలతో మరోసారి పవన్ మ్యాజిక్ సందడి చేయబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
హరి హర వీరమల్లు’ రిలీజ్‌కు రంగం సిద్ధం




