తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (జెడ్పిటిసీలు), మండల పరిషత్ టెరిటోరియల్ కంస్టిట్యూన్సీలు (ఎంపీటిసీలు) సంఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉండగా, మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5773గా ప్రభుత్వం ఖరారుచేసింది.
ఈ నిర్ణయం వచ్చే రోజుల్లో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎంతో కీలకంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కలు, ఇతర పరిపాలనా అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.




