Friday, March 6, 2026
spot_imgspot_img

“డమ్మీ కాదు… మమ్మీ, డాడీ అవుతా!”

Must read

తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు ఓ దూకుడైన ప్రస్థావనతో మీడియా ముందుకు వచ్చారు. “నేను డమ్మీ నాయకుడిని కాదు … అవసరమైతే వాళ్లకు మమ్మీ, డాడీ అవుతా. నా అసలైన రూపం త్వరలో చూడబోతున్నారు,” అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు తనదైన శైలిలో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి రానుందని ధీమాగా వెల్లడించిన రాం చందర్ రావు, “ఈసారి బీసీ వర్గానికి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు” అని స్పష్టం చేశారు. బీజేపీ పాలనతో తెలంగాణకు నిజమైన ప్రజానాయకత్వం అందుతుందంటూ ప్రజల్లో విశ్వాసం నూరిపోసేలా మాట్లాడారు.
“ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నా, ఇక మీదట చర్యలతోనే స్పందిస్తాను. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ మార్పు పేరు బీజేపీ అవుతుంది” అంటూ రాజకీయ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు.రాష్ట్ర రాజకీయ వేదికపై బలమైన మార్పులకు నాంది పలికేలా రాంచందర్ రావు వ్యాఖ్యలు వేడి చర్చకు దారి తీస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!