Friday, March 6, 2026
spot_imgspot_img

క్రీడాకారులకు మద్దతు, సదుపాయాలే విజయానికి నాంది: బండారి లక్ష్మారెడ్డి

Must read

క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలు, దిశానిర్దేశం లభించాల్సిన అవసరం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.విక్టరీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, “ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు మార్గదర్శకత్వం, శిక్షణా వేదికలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇటువంటి అకాడమీలు క్రీడల అభివృద్ధికి విశేషంగా దోహదపడతాయి” అని తెలిపారు.”ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే క్రీడాకారులకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకులు వెంకట రమణా రెడ్డి, చెక్క ప్రసాద్, కోనేరు భాస్కర్, వాసులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. “ఈ అకాడమీ యువతకు ఒక బలమైన వేదికగా నిలవాలని ఆశిస్తున్నాను,” అని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, ఎమ్మెల్యే బాల్కా సుమన్, గెల్లు శ్రీనివాస్, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!