Friday, March 6, 2026
spot_imgspot_img

జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్య

Must read

దాదాపు నాలుగు దశాబ్దాలుగా సంస్కృత ఉపాధ్యాయుడిగా లక్షలాదిమందికి విద్యాబోధన చేస్తున్న ఎస్. ఏ టి.ఎస్ ఆచార్య ఆగష్టు 31, 2025 నాడు గుంటూరు నందు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్(SPLTO) వారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సావాన్ని పురస్కరించుకొని ప్రైవేట్ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాన్ని అందించి సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం సంస్కృత అధ్యాపకులు ఎస్. ఏ టి.ఎస్ ఆచార్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ సభ్యులు విద్యారంగానికి ఎస్.ఏ టి.ఎస్ ఆచార్య అందిస్తున్న సేవలను గురించి కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాన్ని ఆచార్య కు అందించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి గొప్పవారికి మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆచార్య మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా అవార్డు తాను అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా రెండవసారి ఈ అదృష్టం తనను వరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఈ అవార్డు అందజేసిన ఆర్గనైజేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆచార్య కు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు వరించడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!