ప్రముఖ నటుడు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన భార్య రమా రాజమౌళితో కలిసి కోట నివాసానికి వచ్చారు.
కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం రాజమౌళి అక్కడి నుండి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఓ అభిమాని అతనితో సెల్ఫీ దిగేందుకు క్రమశిక్షణ లేకుండా ప్రయత్నించాడు. దీంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తూ అతడిని పక్కకు నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.




