తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి భావోద్వేగాలతో కూడిన వినోదం పంచడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ముందుంటుంది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది. ఈ కార్యక్రమ ప్రసారకర్త స్టార్ మా చానల్ తాజాగా బీబీ7 ప్రోమో విడుదల చేసింది. రెడీగా ఉండండి… ఎమోషన్ల ఎత్తుపల్లాల్లో మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్-7 వచ్చేస్తోంది అని స్టార్ మా చానల్ పేర్కొంది. మరిన్ని సర్ ప్రైజ్ లు, మరిన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్… సిల్లీ ఫైట్స్ నుంచి హృదయాలు బరువెక్కించే గాథల వరకు… సంపూర్ణ వినోదం గ్యారెంటీ అని మేం మీకు హామీ ఇస్తున్నాం అని వివరించింది.