సిఎం కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా తీవ్ర జలుబు తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… నిన్న రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అయితే ఈ పరీక్షలు సీఎం కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తేలింది.
ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ”నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు. ఇంట్లోనే నేను ఐసోలేషన్ లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు, ఐసోలేషన్ లో ఉండాలి. అలాగే అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అని కోరారు. కాగా… ఢిల్లీ లో గత వారం రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో… ఢిల్లీలో కరోనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. థియేటర్లు, పార్కులు, బార్లు, పార్టీ మీటింగ్స్ పై ఆంక్షలు ఉన్నాయి.
Share this article in your network!