నాకు కొడాలి నాని అంటే ఎవరో తెలీదు : రాంగోపాల్ వర్మ
సినిమా టికెట్ల వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం లో ఎన్నడూ లేని విధంగా రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగాడు.
సినిమా టికెట్ల వివాదంపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కు అండగా నిలుస్తూ ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు వర్మ.
ఈ నేపథ్యంలోనే నిన్న పేర్ని నాని కి కౌంటర్ ఇచ్చిన వర్మ.. ఇప్పుడు ఏపీ మంత్రి కొడాలి నాని కి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాకు న్యాచురల్ స్టార్ నాని తప్ప… కొడాలి నాని ఎవరో తెలియదంటూ… తన స్టైల్లో వర్మ కౌంటర్ ఇచ్చారు.
' ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ ఒక్కడే..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.' అంటూ కౌంటర్ ఇచ్చారు వర్మ. కాగా ఇటీవలే ఏపీ మంత్రి అనిల్ కుమార్.. నాకు కూడా లేని అని తప్ప హీరో నాని తెలియదా అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా నే తాజాగా వర్మ ఈ వ్యాఖ్యలు చేయడం హల్చల్ గా మారింది.
Share this article in your network!