నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు. ఈనేపథ్యంలోనే ఆయన తనయుడు, నటుడు విష్ణు తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని ఆయన అన్నారు. నిన్న జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవడం దురదృష్టకరం అన్నారు. అతని కుటుంబంతో మాట్లాడామని, అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు.