మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం గోవిందరావు పేట మండలం, చాల్వాయి ఆదర్శ పాఠశాల లో కంప్యూటర్ ల్యాబ్, (సి ఎస్ ఆర్ నిధులు మౌరిటెక్ ఐటి సంస్థ సౌజన్యం) 10 కంప్యూటర్ల తొ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ చైర్మన్ రవి చందర్ లతొ కలసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.

అనంతరం చాల్వాయి లోని ట్రైనింగ్ సెంటర్లో SHG మహిళలకు USHA ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో కుట్టు మిషన్ 25 రోజుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రంను మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో రోజులుగా టీచర్ల యొక్క సమస్యలు పెండింగ్లో ఉంటే సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమోషన్ ఇచ్చి, ట్రాన్స్ఫర్స్ చేయడం జరిగిందని అన్నారు. 60 రోజులలో నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా 11,000 మందికి టీచరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈనాటి ప్రభుత్వానీదే అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆలోచనతో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు. ఆధునికమైనటువంటి విద్య, కంప్యూటర్ విద్య అందాలానే ఉద్దేశం తో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను ములుగు జిల్లా పిలువడం జారుతుందని అన్నారు. ములుగు అంటే వెనుకబడ్డ జిల్లా అని మనం చెప్పుకుంటున్నాము. కచ్చితంగా జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకురావాలని అన్నారు.మానసిక ఉత్సాహం, ఉల్లాసం ధైర్యం, గౌరవించే మనస్తత్వం కూడా నేర్చుకోవాలని అన్నారు. పేదల పట్ల ప్రేమ కరుణ ఉండాలనీ ఆన్నారు. ప్రతి గ్రూపుకు రెండు లక్షల నుంచి 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందనీ ఆన్నారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను తీసుకుంటున్న మహిళలు సకాలంలో అప్పు చెల్లించాలని, తిరిగి పెద్ద మొత్తంలో అప్పు కోరిన మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళలు బాగుంటేనే గ్రామాలు సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలననే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిగా చదువుకొని పోటీ తత్వంలో ముందుకు వెళ్లాలని అన్నారు. మీరు మంచిగా చదువుకోని మీ తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని విద్యార్థుల లకు హితవు పలికారు. ప్రతి విద్యార్థి ఈ సంవత్సరం మెరిట్ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు.స్కూల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అంకితభావం, కష్టపడే మనస్తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని అన్నారు. జీవితంలో ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలని, అయితే ఏ రంగంలోనైనా పోటీ సాధారణమని, ప్రత్యేకించి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా వ్యాపార రంగంలో స్థిరపడాలనుకుని శిక్షణ పొందిన మహిళ అభ్యర్థులు అంకితభావంతో, కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా రాణిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ఉషా కంపనీ డిప్యూటీ మేనేజర్ రాజ్ కుమార్, ఏపీడి, తహసిల్దార్, ఎంపీడీవో, ఏటీఎంలో, వివో లు, సిఏలు, మహిళా సంఘ సభ్యులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.