ఎస్. ఏ. టి. ఎస్. ఆచార్యకు ఉత్తమ అధ్యాపకుడిగా జాతీయ అవార్డు
సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సరైన పదోన్నతులు, సన్మానాలు, అనేక రకాల పురస్కారాలు, ఇతర సదుపాయాలు ఉంటాయి, కానీ ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి అలా ఉండదు, వీరిని గుర్తించి సత్కరించడం చాలా తక్కువ. ఈ విషయం అందరికీ విదితమే. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని సౌత్రన్ ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్(ఎస్ పీ ఎల్ టి ఓ) వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అవార్డులు పేరుతో వివిధ రాష్ట్రాలలోని ఉత్తమ అధ్యాపకులను జులై 25 వ తారీఖు గుంటూరు ఏసీ క్రిస్టియన్ కళాశాలలో సత్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ నుండి 3 దశాబ్దాలపైగా అధ్యాపక వృత్తిలో ఉంటూ ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన సంస్కృత ఉపాధ్యాయులు శ్రీమత్ అద్దంకి తిరుమల సింగరాచార్యులు ప్రతిష్టాత్మకమైన డా || సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు షేక్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విద్యారంగం బలోపేతం అవ్వడానికి ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర ఎంతో కృషి చేస్తున్నాయని, ఈ విధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ విధంగా సత్కరించి, తద్వారా ఉపాధ్యాయులకు ఎంతో ప్రోత్సాహం అందించడానికి ఎస్ పీ ఎల్ టి ఓ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం అన్నారు.
Share this article in your network!