ఈరోజు జి.హెచ్.ఎం.సి ప్రధాన కార్యాలయంలో శానిటైజేషన్ గురుంచి జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. 

ఈ సందర్భంగా శ్రవణ్ ప్రతీ ఇంట్లో ప్రతీరోజు తప్పనిసరిగా స్వచ్చ ఆటోలు చెత్త సేకరించాలని, వెంటనే సంచార చెత్త కేంద్రాలని ఏర్పాటు చేసి ఆధునిక యంత్రాల ద్వారా నగరం లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతోపాటు సత్వరమే పారిశుధ్య కార్మికుల కారుణ్య నియామకాలు చేపట్టాలని హైదరాబాద్ సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కోరారు. అదేవిధంగా రాంకీ పనితీరుపై ఒక నివేదిక ఇవ్వాలని కమిటీ అధికారులను శ్రవణ్ ఆదేశించారు.

undefinedఈ కార్యక్రమంలో శానిటైజేషన్ అదనపు కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, రాంకీ సి.ఎం.డి రఘు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.