అందరూ సహకరించాలి.... సమస్య ఉంటే కాల్ చేయండి...
మల్కాజగిరి డివిజన్ బాలసరస్వతి నగర్ లో మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కొనసాగుతున్న నాలా పనులను పరిశీలించి నాలా లో పూడికతీత వెంటనే చెయ్యాలని అధికారులను ఆదేశించడంతో పాటు నాలా మధ్యలో ప్రైవేట్ భూమిగల వారికి పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని కాలనీ వాసులకు తెలియజేసారు.తదుపరి శానిటైజేషన్ సిబ్బంది తో కలిసి చెత్త గురుంచి కాలనీ వాసులతో అవగాహనా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ చెత్తను తప్పనిసరిగా చెత్త కోసం పెట్టిన ఆటో (SAT) లలో మాత్రమే ఇవ్వాలని స్థానిక మహిళలను కోరడంతో పాటు ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, కాలనీ వాసులకు ఇబ్బందులు ఉంటే వెంటనే తనకు చరవాణి ద్వారా సమాచారం అందించాలన్నారు, అలాగే కాలనీ వీధులను శుభ్రంగా ఉంచాలని శ్రవణ్ శానిటైజేషన్ సిబ్బందిని ఆదేశించారు.తదుపరి వాటర్ వర్క్స్ అధికారులతో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి ప్రతిపాదలను పంపాలని కోరారు. ఈ కార్యక్రమం లో జి.హెచ్.ఎం.సి ఇంజనీరింగ్ అధికారులు మహేష్, దీపక్, రమేష్, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, గిరి, బాలమణి, రాములు, కాలనీ వాసులు ప్రవీణ్, భాస్కర్, రమేష్, మూర్తి, సన్నీ మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Share this article in your network!