ఎంతో మంది పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవి పాఠశాలలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు అత్యంత ముఖ్యం, అప్పుడే దేశం పురోగభవృద్ధి చెందుతుంది. అయితే దాదాపు చాలా ప్రభుత్వ పాఠశాలలలో కనీస వసతులు లోపించడం వలన తల్లితండ్రులు ఎంతో కష్టపడుతూ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్న పరిస్థితి. ఎంతో మంది ఈ విషయం పై మాట్లాడుతున్నా ఇప్పటికీ మన ప్రదేశంలోని ప్రభుత్వ పాఠశాలలో మార్పు పెద్ద కనపడడం లేదు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లల్లో టాయిలెట్స్ లేకపోవడం, ఆహార నాణ్యత సరిగ్గా లేకపోవడం మరియు కానీస సౌకర్యాలు లేకపోవడం గురుంచి గత ప్రభుత్వంలోని అధికారులకు,మంత్రులకు మరియు ఇప్పటి మంత్రులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, చివరికి ఉపాధ్యాయులు కూడా ఈ విషయం పై మొత్తుకున్నా కూడా ఫలితం లేకపోవడంతో తాను జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవలసి వచ్చిందని అన్నారు.