మల్కాజిగిరి నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న యు బి, భూగర్భ డ్రైనేజీ, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన బాధ్యత అని వారి సేవకుడిగా నిరంతరం వారికి అందుబాటులో ఉంటానని అన్నారు. సోమవారం వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మున్నూరుకాపు కళ్యాణ మండపంలో సోమవారం

వినాయక నగర్ డివిజన్ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్

రాజ్యలక్ష్మి ఈటలను సత్కరించారు. డివిజన్ పరిధిలో నెలకొన్న రైల్వే వంతెనెల సమస్యలు, కలుషిత చెరువులు, నాళాల అభివృద్ధి మొదలగు సమస్యలను కార్పొరేటర్ వినతి పత్రం ఇచ్చారు. దీనిపై ఈటెల స్పందించి మల్కాజిరి లో నెలకొన్న అనేక సమస్యల్ని

పరిష్కరించే బాధ్యత తనదన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నాయకుడిగా తన బాధ్యత అన్నారు. వచ్చే ఐదు ఏళ్లలో మల్కాజ్గరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ సందర్భంగా డివిజన్పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల

నాయకులు మహిళలు టిడిపి నాయకులు ఈటలను సత్కరించి వారి కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. వాటిని పరిష్కరించే బాధ్యత తనదని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భానుప్రకాష్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీకే మహేష్, రాష్ట్ర బీసీ నాయకులు గణేష్ చారి, సీనియర్ నాయకులు వడ్డే సుబ్బారావు,

గోపాల్, నరేందర్, శివ, మహేష్, ఓం ప్రకాష్, నవీన్, సాయి సురేష్, తదితరులు పాల్గొన్నారు.