క్రమం తప్పకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం : మంత్రి సీతక్క
ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించి, వినతులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై ప్రజలు ప్రజావాణినిలో అధికంగా దరఖాస్తులను చేసుకుంటున్నారని అన్నారు. సుపరిపాలన మరియు జవాబుదారీతనంతో కూడిన ప్రజల ప్రభుత్వం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్రమం తప్పకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజావాణికి దరఖాస్తు ఇచ్చే వారు కిలోమీటరు దూరం వరకు బారులు తీరిన అర్జీదారులు, తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేశారు.ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని అన్నారు.
Share this article in your network!